నిను వీడని నీడను నేనే - లిరికల్ సాంగ్

Submitted on 13 June 2019
Ninu Veedani Needanu Nene Lyrical song

సందీప్ కిషన్, అన్య సింగ్ జంటగా, కార్తీక్ రాజు డైరెక్షన్‌లో రూపొందుతున్న థ్రిల్లర్, 'నిను వీడని నీడను నేనే'.. వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్టా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్స్ పై, దయ పన్నెం, సందీప్ కిషన్, విజ్జి సుబ్రమణియన్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు నిను వీడని నీడను నేనే నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు.

'చెప్పాలా, కథ నీకే మళ్లీ నేనిలా, ఒక నువ్వు, ఒక నేను ఒక భావం, చూపాలా కల నీకే మళ్లీ నేనిలా.. సంతోషం సర్వస్వం సగభాగం.. వీడని తోడై నే ఉంటా, తీరని కోరిక నువ్వంటా.. అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ బాగుంది.. థమన్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి, ప్రముఖ సెలబ్రిటీ స్టైలిష్ట్ నీరజ కోన లిరిక్స్ రాయగా, యాజిన్ నిజార్ పాడాడు.. నిను వీడని నీడగా నేనై ఉంటానే.. యుగములు గడిచిన మరువని తోడై వస్తానే.. వంటి లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి..

త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు. పోసాని, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : పికె వర్మ, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, సంగీతం : ఎస్ఎస్ థమన్, ఆర్ట్ : విదేష్, స్టంట్స్ : వెంకట్.


 

Sundeep Kishan
Anya Singh
SS Thaman
Caarthick Raju

మరిన్ని వార్తలు