నిను వీడని నీడను నేనే మూవీ రివ్యూ

Submitted on 12 July 2019
Ninu Veedani Needanu Nene Movie Review

సినిమా: నిను వీడని నీడను నేనే

జానర్ : థ్రిల్లర్‌
తారాగణం : సందీప్‌ కిషన్‌, అన్యా సింగ్‌, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ
సంగీతం : తమన్
దర్శకత్వం : కార్తీక్ రాజు
నిర్మాత : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల

కెరీర్ ఆరంభంలో వరస హిట్లు అందుకుని యంగ్ హీరోల్లో తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సందీప్ కిషన్. కొందకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న సందీప్ కిషన్... తానే నిర్మాతగా మారి తీసిన సినిమా 'నిను వీడని నీడను నేనే'. టీజర్ అండ్ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచిన 'నిను వీడని నీడను' శుక్రవారం(12 జులై 2019) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది. హీరోగా సందీప్ కిషన్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా? హీరోగా, నిర్మాతగా తన బాద్యతలను సందీప్ సమర్థవంతంగా పోషించాడా..? అనే విషయాలు తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
సినిమా కథ 2035లో మొదలవుతుంది. సైకాలజీ ప్రొఫెసర్‌(మురళీ శర్మ) తను డీల్‌ చేసిన ఓ కేసుకు సంబంధించిన విషయాలను చెబుతుంటాడు. కథ 2013 సంవత్సరానికి మారుతుంది. అర్జున్ (సందీప్‌ కిషన్‌), మాధవి (ఆన్య సింగ్) ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్లు వెళ్తున్న కారుకు అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తరువాత అర్జున్ అద్దంలో చూసుకున్న ప్రతి సారి అతనికి రిషి అనే మనిషి కనిపిస్తాడు. అలాగే మాధవికి దియా అనే వ్యక్తి కనిపిస్తుంది. అద్దంలో వేరే వ్యక్తులు కనపడడానికి కారణం ఏంటి.? అద్దంలో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు? రిషీ, దియాలు వీరిద్దరికి ఎందుకు కనిపిస్తున్నారు? అన్నదే సినిమా కథ. 

నటి నటులు:
గతంలో తన ఎనర్జీతో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో లైటర్ వెయిట్ ఉన్న లవర్ బాయ్ పాత్రలు చేసి మెప్పించిన సందీప్ కిషన్ ఫస్ట్ టైం కాస్త సెంటిమెంట్ డోస్ ఉన్న హారర్ సబ్జెక్టుని ఎంచుకుని బాగా నటించాడు. సినిమాలో చాలా భాగం వెన్నెల కిషోర్ తో పోటా పోటీ గా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా అతని నటన ఆకట్టుకుంది. కొత్త హీరోయిన్ అన్యా సింగ్ లుక్స్ పరంగా యావరేజ్ అనిపించినా నటన పరంగా మెప్పించింది. ఈ మధ్య అనేక సినిమాలకు సేవియర్‌గా మారుతున్న వెన్నెల కిషోర్ ఈ సినిమాకి కూడా చాలా ప్లస్ అయ్యాడు. చాలా వరకు డైలాగ్స్ లేకుండా తన హవా భావాల తోటే కామెడీ పండించాడు. డాక్టర్ గా మురళి శర్మ , పోలీస్ ఆఫీసర్‌గా పోసాని, ప్రగతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ : 
ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ రాజు ఎంచుకున్న కథాంశం కాస్త రొటీన్‌గా ఉన్నా కూడా స్క్రిన్ ప్లే వైవిధ్యంగా ఉంది. కథలో సెంటి మెంట్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాను గ్రిప్పింగ్‌గా నడిపించిన కార్తీక్ రాజు సెకండ్ హాఫ్‌లో మాత్రం కాస్త తికమక పెట్టాడు. అలాగే మెయిన్ పాయింట్ నుంచి డివియోట్ అయి క్లైమాక్స్‌లో ట్రాక్‌లోకి తీసుకుని వచ్చాడు. ప్రమోద్ వర్మ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. డైరెక్టర్ తో అతనికి కుదిరిన సింక్ వల్ల చాలా క్లిష్టమైన సన్నివేశాలు ప్రేక్షకులకు తేలికగా అర్ధమయ్యాయి. లిమిటెడ్ బడ్జెట్ తోనే సినిమాకి రిచ్ నెస్ తీసుకొని వచ్చాడు. తమన్ మ్యూజిక్ కూడా సినిమా బిగ్గెస్ట్ ఎసెట్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌:
సినిమాటోగ్రఫీ
సందీప్ కిషన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ట్విస్ట్‌లు

మైనస్‌ పాయింట్స్‌: 
లాజిక్ లేని సీన్స్
సెకండ్ హాఫ్ కామెడీ

ఓవరాల్‌గా.. హర్రర్ బ్యాక్ డ్రాప్‌లో సెంటిమెంట్ మిక్స్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సగం వరకు ఆసక్తిగా సాగింది.రెండవ భాగం కాస్త తడబడినా కూడా రెండు భాషలలో విడుదలవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర సేఫ్ వెంచర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Ninu Veedani Needanu Nene
Movie Review


మరిన్ని వార్తలు