BJPకి బై బై చెప్తారా! : ఆర్ఎస్ఎస్ కదలికలపై నితీష్ నిఘా

Submitted on 17 July 2019
 Nitish Kumar's Cops Compile Report On RSS; "Uncalled For," Says BJP

బీహార్ హోం డిపార్ట్మెంట్ ఆర్ఎస్ఎస్,దాని అనుబంధ సంస్థల గురించిన సమాచారాన్ని సేకరించి ఓ రిపోర్ట్ ను తయారుచేస్తుంది. బీహార్ సీఎం నితీష్ కొన్ని రోజులుగా కేంద్రసర్కార్ తో దూరంగా ఉంటున్నారన్న వార్తలు వినిపిస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల వివరాల సేకరణ ఇప్పుడు బీహార్ పాలిటిక్స్ లో కాక రేపుతోంది. బీహార్  ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. 

బీజేపీకి ఐడియలాజికల్ మెంటార్ గా ఉన్న ఆర్ఎస్ఎస్,దాని 18 అనుబంధ సంస్థల గురించిన ప్రతీ విషయాన్ని బీహార్ హోం డిపార్ట్మెంట్ సేకరిస్తోంది. సీఎం నితీష్ కుమార్ కి దీనికి సంబంధించిన వివరాల గురించి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంది. బీహార్ పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ బ్రాంచ్ కి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి వివిధ సున్నితమైన అంశాలపై ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. మే-28,2019న స్పెషల్ బ్రాంచ్ నుండి వచ్చిన లేఖ ప్రకారం...వారంలోపు ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క డీసీపీ, ఆర్ఎస్ఎస్ కదలికల వివరాలు తెలిజేయాలని కోరింది. హోం మంత్రిత్వ శాఖను కూడా సీఎం తన దగ్గరే ఉంచుకున్న విషయం తెలిసిందే.

అయితే స్పెషల్ బ్రాంచ్ లేఖపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ మయుఖ్ రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ చర్యను తాము సమర్థించడం లేదన్నారు. అయితే రొటీన్ ప్రాసెస్ లో భాగంగానే ఇది జరుగుతున్నట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే-23,2019న విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే మోడీ కేబినెట్ లో జేడీయూ మంత్రుల సంఖ్య దగ్గర బీజేపీకి,నితీష్ కి చెడిందనే వార్తలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం  రోజుల్లోనే నితీష్ ఆర్ఎస్ఎస్ పై ఫోకస్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ,నితీష్ నాయకత్వంలోని జేడీయూ, కాంగ్రెస్ కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నితీష్ కుమార్ సీఎం బాధ్యతలు చేపట్టారు. అయితే ఆర్జేడీతో విభేదాలంటూ సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయడం,వెంటనే బీజేపీ మద్దతుతో మళ్లీ నితీష్ సీఎంగా ప్రమాణం చేయడం జరిగిపోయిన విషయం తెలిసిందే.
 

BIHAR
Nitish Kumar
RSS
activities
reports
HOME DEPARTMENT
collecting
information
BJP
alliance

మరిన్ని వార్తలు