26/11 ముంబై ఉగ్రదాడితో సంబంధం లేదన్న హఫీజ్ సయూద్

Submitted on 12 July 2019
No role in 26/11 Mumbai attack’: Hafiz Saeed tells Pak court on terror charges

ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న ఆరోపణలతో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు వ్యతిరేకంగా లాహోర్‌ హైకోర్టులో జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్‌ సయీద్ సవాలు చేశాడు. ఇవాళ(జులై-12,2019) సయీద్‌తో పాటు అమీర్ హమ్జా,అబ్దుర్ రెహమాన్ మక్కి,ఎమ్ యహ్యా ఆజిజ్ సహా మరో నలుగురితో కలిసి లాహోర్ హైకోర్టులో సయీద్ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు .తమపై దాఖలైన ఎఫ్ఐఆర్‌లను నిరుపయోగమైనవనిగా తేల్చాలని వారు ఆ పిటిషన్‌ లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అంతేకాకుండా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం, ఉగ్రవాద వ్యతిరేక విభాగాలను దానిలో ప్రతివాదులుగా చేర్చారు. 

నిషేధిత ఉగ్రసంస్థలైన లష్కరే తొయిబా, ఆల్‌ఖైదా, తదితర సంస్థలతో తనకు ఎటువంటి సంబంధం లేదని సయీద్‌ తెలిపాడు. 26/11 ముంబై ఉగ్రదాడిలో తమ పాత్ర ఏమీ లేదని తెలిపాడు. సయీద్ ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి అంటూ భారత్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని దానిలో తెలిపారు. 

ఉగ్రసంస్థలకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో పంజాబ్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం సయీద్, అతడి 12 మంది అనుచరుల మీద కొద్ది రోజుల క్రితం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. అయితే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితోనే పాక్ ఇలాంటి కంటితుడుపు చర్యలకు పాల్పడుతోందని భారత్‌ చెబుతున్న విషయం తెలిసిందే.

Mumbai
26/11 TERROR ATTACK
Pak
TERROR CHARGES
Finance
Hafiz Saeed


మరిన్ని వార్తలు