టీమిండియాకు షాక్: టిక్కెట్లు లేవ్.. అప్పటివరకూ ఇంగ్లాండ్‌లోనే

Submitted on 12 July 2019
No tickets, Team India stranded in England till WC final

టీమిండియాకు వరల్డ్ కప్ ఆశలు ఆవిరైన వేళ తిరుగు ప్రయాణమైన కోహ్లీసేనకు షాక్ తగిలింది. భారత్ వెళ్లేందుకు టిక్కెట్లు లేవని చెప్పేశారు. దీంతో టిక్కెట్లు ఎప్పుడు దొరుకుతాయోనని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా భారత్ 18పరుగుల తేడాతో ఘోర పరభావానికి గురైంది. 

టైటిల్‌కు ఇంకొక్క అడుగుదూరంలో నిలిచిన జట్టు వరుసగా 1, 1, 1 వికెట్లు చేజార్చుకోవడం జట్టుతో పాటు అభిమానులను కుంగదీసింది. మ్యాచ్ జరుగుతుండగానే ప్లేయర్ల నిరుత్సాహం పెవిలియన్ స్టాండ్ నుంచి కనిపిస్తూనే ఉంది. దీంతో మ్యాచ్ ముగిసిన రెండో రోజే బయల్దేరాలని భావించిన టీమిండియాకు టిక్కెట్లు దొరకలేదట. 

ఈ విషయంపై బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. 'వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ జూలై14వరకూ చాలా మంది భారత క్రికెటర్లు మాంచెస్టర్‌లోనే ఉండిపోనున్నారు. టిక్కెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తే జూలై 14వరకూ విమానాల సీట్లు ఖాళీ లేవు' అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. వరల్డ్ కప్ తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆగష్టు 3నుంచి వెస్టిండీస్‌తో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు వెళ్లనుంది. 

Team India
england
india
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు