ల్యాండ్ మాఫియాలో ఎంపీ అజంఖాన్!

Submitted on 15 July 2019
UP officials to list SP leader Azam Khan as land mafia on UP anti-land grabbing portal

యూపీ రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతోన్న ల్యాండ్‌ మాఫీయాను అరికట్టేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కీలక చర్యలను చేపట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాఫీయా ముఠా పేర్లను సేకరించి, వాటిని యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ పోర్టల్ లో పొందుపరుస్తున్నారు. రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్‌ లో గతంలో నమోదయిన కేసు వివరాలను అధికారులు సేకరించి, సీఎం కార్యాలయం పంపుతున్నారు. అయితే వీటిల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, వివాదాస్పద నేత ఆజంఖాన్‌ పేరు కూడా ఉంది. ఆయనపై ల్యాండ్‌ మాఫీయా గురించి అనేక ఆరోపణలు ఉన్నాయని, ఇప్పటివరకు 30 కేసులు కూడా నమోదయి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : సిద్ధమౌతున్న జాతీయ టారిఫ్ విధానం : వేళలను బట్టి కరెంటు ఛార్జీలు

ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం  వహిస్తున్న రాంపూర్‌ లోక్‌సభ పరిధిలో అనేక కేసుల ఉన్నట్లు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అజయ్‌ పాల్‌ శర్మ తెలిపారు. 2012-2017 మధ్యకాలంలో ఆజంఖాన్‌ యూపీ రెవెన్యూ శాఖమంత్రిగా  పనిచేసిన సమయంలో అమాయక రైతుల నుంచి భారీ ఎత్తున భూమిని లాక్కుని, పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అయితే ఆయనపై ఉన్న కేసులు కోర్టుల్లో రుజువైతే అరెస్ట్‌ చేసే అవకాశం కూడా ఉందన్నారు. దీనిపై ఎస్పీ నేతలు తీవ్ర స్థాయిలో  ఫైర్ అయ్యారు. కేంద్రప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కక్షసారింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ తప్పుడు కేసులని కొట్టిపారేశారు. 

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో రామ్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయప్రదపై అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వివాదాస్పద నేతగా గుర్తింపు పొందిన ఆజాంఖాన్‌ ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నంటున్నారు.
Also Read : మా భవిష్యత్తు ఇస్మార్ట్ శంకర్ తోనే!

land mafia
SP LEADER
UP
officials
List
Azam Khan
Controversial Comments
ANTI LAND
GRABBING
PORTAL

మరిన్ని వార్తలు