తెలంగాణలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు

Submitted on 10 June 2019
oil reservese in komaram bheem district Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయన్న వార్త ఇప్పుడు సంచలనం కాబోతోంది. సాధారణంగా సముద్రతీర ప్రాంతంలో లభ్యమయ్యే గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు ఇప్పుడు కుమురంభీం, మంచిర్యాల జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో నిపుణులు సర్వే చేస్తున్నారు. ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈసర్వేలో కుమురంభీం జిల్లా పరిధిలోని కాగజ్‌నగర్, సిర్పూర్‌(టీ), దహెగాం, పెంచికల్‌ పేట మండలాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. 

కుమురం భీంజిల్లాలోని పలు గ్రామాల్లో ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాల కోసం ప్రాథమిక సర్వేలు చేపడుతున్నామని అధికారులు చెప్పారు. సర్వేల రిపోర్టులు, డ్రిల్లింగ్‌లో వెల్లడైన ఫలితాల ఆధారంగా 8 నెలలపాటు పూర్తి స్థాయి సర్వేలు చేపడతాం. నిక్షేపాల తీరునుబట్టి స్థానికంగా వెలికితీత ప్రారంభమవుతుందని అధికారులు వివరించారు. 

ఓఎన్జీసీ నిపుణుల ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ఇక్కడ సర్వే పనులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో అధునాతన పరికరాలతో చేపట్టిన సర్వే మొదటిదశ పూర్తి కావస్తోంది. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం ఎనిమిది నెలల పాటు పరీక్షలు నిర్వహించి నిక్షేపాలు కచ్చితంగా లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తిస్తామని ఓఎన్‌జీసీ అధికారులు చెప్పారు.

శుక్రవారం  సిర్పూర్‌(టీ)మండల కేంద్రంలోని దుబ్బగూడకాలనీ ప్రాంతంలో సర్వే నిర్వహించడంతో పాటు ఎంపిక చేసిన స్థలాల్లో డ్రిల్లింగ్‌ చేసి పరీక్షలు నిర్వహించారు. అలాగే శనివారం సిర్పూర్‌(టీ), నవేగాం, హుడ్కిలిగ్రామాల్లో కేబుళ్లను అమర్చికంప్యూటర్లలో పరిశీలిస్తూ, డ్రిల్లింగ్‌చేశారు. దీనికిముందుగా కాగజ్‌నగర్‌ మండలంలోని అనుకోడ, చుంచుపల్లి, గన్నారం, చింతకుంట గ్రామాల మీదుగా కేబుల్‌లైన్లు వేస్తూ సర్వే నిర్వహించారు. డ్రిల్లింగ్‌ చేయగా వచ్చే ధ్వనితరంగాలద్వారా నిక్షేపాలను  పసిగడుతున్నట్లు తెలుస్తోంది.

రెండవ దశలో భద్రాచంలం వరకు 
రెండవదశ సర్వే  కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగునుంచి కుమురంభీం జిల్లాతోపాటు మంచిర్యాలజిల్లా మీదుగా భద్రాచలం జిల్లాల్లో ప్రాథమిక సర్వేలు నిర్వహిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి 8 నెలలపాటు సర్వే చేయనున్నట్లు చెప్పారు.  నిక్షేపాలున్న స్థలాలను గుర్తించి పూర్తిస్థాయి సర్వేలు చేపడతామని అధికారులు తెలిపారు. కుమురం భీం జిల్లాతోపాటు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లోని భీమిని మండలం నందుగులగూడ గ్రామ పరిసరాల్లో ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాలున్నట్లు  అధికారులు తెలిపారు. 

komaram bheem
oil reserves
Telangana
ONGC

మరిన్ని వార్తలు