రోడ్డు ప్రమాదం : కారు-లారీ దగ్ధం : ఒకరికి తీవ్ర గాయాలు

Submitted on 26 May 2019
one injured at road accident in rajendra nagar

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ, కారు దగ్ధం అయ్యాయి. అతివేగంగా వచ్చిన కారు.. రాజేంద్రనగర్ ఖాలీజ్ ఖాన్ దర్గా దగ్గర లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. మంటలు లారీకి అంటుకున్నాయి. దీంతో కారుతోపాటు లారీ దగ్ధం అయింది. 

కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న పెట్రోలింగ్ సిబ్బంది గమనించి..క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న పెయింటింగ్ డబ్బాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
 

one
Injured
road accident
rajendra nagar
Hyderabad
Car
Lorry
Burn

మరిన్ని వార్తలు