పరీక్ష రాసింది ఒక్కరే...కాపలాగా ఆరుగురు

Submitted on 13 June 2019
one student attend ssc exam : Six members duties fulfilled

వికారాబాద్ జిల్లాలో జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం (జూన్ 10, 2019) పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా కొండగల్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో బుధవారం (జూన్ 12, 2019) ఒకే ఒక్క విద్యార్థి పరీక్ష రాశాడు.

ముగ్గురు విద్యార్థులు పరీక్షకు హాజరు అవ్వాల్సివుండగా ఒక్క విద్యార్థి మాత్రమే హాజరయ్యాడు. ఇద్దరు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. దీంతో ఒక్క విద్యార్థి పరీక్ష రాస్తుండగా ఆరుగురు విధులు నిర్వర్తించారు.

one student
Attend
ssc exam
Six members
duties
fulfill
Vikarabad
Kodangal

మరిన్ని వార్తలు