జూలై 8 నుంచి OU CPGET సెమిస్టర్ ఎగ్జామ్స్

Submitted on 8 June 2019
Osmania-University-To-Conduct-CPGET-From-July-8

ఉస్మానియా యూనివర్సిటీ సోమవారం(జూలై 8, 2019) నుంచి 22వ తేదీ వరకు కామెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్ట్రెన్స్ టెస్ట్ (CPGET) నిర్వహిస్తుంది. అయితే కొన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ BA, BSC, B.COM ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జూలై మొదటి వారం వరకు జరుగనున్న సందర్భంగా దరఖాస్తు తేదీతోపాటు... ఎన్ట్రెన్స్ టెస్ట్ తేదీల్లోను మార్పులు జరిగాయి. దీంతో జూన్ 14 నుంచి ప్రారంభం కావాల్సిన ఎన్ట్రెన్స్ టెస్ట్ జూలై 8 నుంచి ప్రారంభమై 22తో ముగియనున్నాయి. 

OU షడ్యూల్ ప్రకారం అభ్యర్ధులు కామెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్ట్రెన్స్ టెస్ట్ (CPGET)కు జూన్ 12 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో జూన్ 20వ తేదీకి రూ.500 చెల్లించాలి. రూ.2000 ఆలస్య రుసుముతో జూన్ 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రతీసారి యునివర్సిటీలు ఎవరికి వారు విడివిడిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్ట్రెన్స్ టెస్ట్ నిర్వహించుకునేవారు. కానీ మొదటిసారి వివిధ PG కోర్సుల కోసం ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమురు, శాతవాహన కలిసి కామెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్ట్రెన్స్ టెస్ట్  నిర్వహిస్తున్నాయి.

Osmania University
conduct
CPGET
2019

మరిన్ని వార్తలు