వరల్డ్ కప్ కోసం: ఇంగ్లాండ్‌కు 80వేల మంది భారతీయులు

Submitted on 16 May 2019
Over 80k Indian cricket fans to head to England for World Cup

ప్రపంచవ్యాప్తంగా అందులోనూ ఇండియన్స్‌కు క్రికెట్‌పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటిది నాలుగేళ్లకు ఒకసారి వరల్డ్ కప్ వస్తుంటే ఇక ఇండియన్స్ తమ క్రేజ్‌ను ఎలా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే వరల్డ్ కప్‌లో ఇండియా గెలవాలంటూ పూజలు మొదలెట్టేశారు. వరల్డ్ కప్ 12వ ఎడిషన్ ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో మే 30వ తేదీ నుంచి ప్రారంభమై జూలై 14న ముగుస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లను చూసేందుకు యూకేకు క్యూ కడుతున్నారు ఇండియన్ క్రికెట్ అభిమానులు. వరల్డ్ కప్ సమయంలో రోజుకు 3,500 మంది యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారంటే వరల్డ్ కప్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

యూకేకు సాధారణంగా రోజుకు 1,000 వీసా అప్లికేషన్స్ వస్తాయి. అయితే వరల్డ్ కప్ సమయంలో ఈ సంఖ్య 3,500కు చేరిందని గ్లోబల్ టూరిజం కౌన్సిల్ వెల్లడించింది. ఈసారి వరల్డ్ కప్ చేసేందుకు దాదాపు 80వేల మంది భారతీయులు యూకేకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు యూకే టూర్ ప్లాన్ చేస్తుండగా... మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి వరల్డ్ కప్ కానుందని వినిపిస్తుండడంతో డైరెక్ట్‌గా ధోనీ ఆటను చూసేందుకు వస్తున్న అభిమానులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్క ఏప్రిల్, మార్చిలోనే లక్షా 30వేల యూకే విసా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

80k Indian cricket fans
england
World Cup

మరిన్ని వార్తలు