మోదీని అల్లాయే ఓడిస్తాడు: చరిత్ర తెలుసుకుని మాట్లాడండి..

09:32 - December 3, 2018

హైదరాబాద్ : నిత్యం వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తన పదునైన వ్యాఖ్యలకు పనిచెప్పారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎంపీ అసదుద్దీన్..అల్లా బీజేపీని ఓడిస్తాడని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మలక్‌పేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఒవైసీ ప్రధాని మోదీ, యూపీ ఎంపీ ఆదిత్యానాధ్ లపై ఘాటుగా స్పందించారు. భారతదేశం బీజేపీ, ఆర్ఎస్ఎస్ లది మాత్రమే కాదనీ..అందరిదీననీ..మోదీ, ఆర్‌ఎస్సెస్, యోగిలకు వ్యతిరేకంగా మాట్లాడినా..వారిని విమర్శించినా..దేశం నుంచి తరిమేస్తారా? అని ఓవైసీ ఆవేశంగా  ప్రశ్నించారు.అల్లా మోదీని ఓడిస్తాడని  ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు. కాగా డిసెంబర్ 2వ తేదీని  తెలంగాణలో  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యూపీ సీఎం ఆదిత్యానాథ్ మాట్లాడుతు..బీజేపీ అధికారంలోకి ఖామమనీ..నిజాం హైదరాబాద్ వదిలి వెళ్లిపోయినట్లుగానే ఎంఐఎం నేతలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేస్తామని యోగి హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఘాటుగా స్పందించిన ఒవైసీ..ఎంఐఎం చరిత్రపై యూపీ సీఎంకు ఏ మాత్రం అవగాహన లేదని..తెలియకపోతే చరిత్ర తెలిసిన వారిని అడిగి తెలుసుకోండని ఎద్దేవా చేశారు. నిజాంను హైదరాబాద్ నుంచి గెంటేయలేదు, ఆయన్ను రాజ్ ప్రముఖ్‌గా నియమించారని..ఈ విషయాన్ని యోగీ తెలుసుకోవాలని పరుషంగా కౌంటరిచ్చారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..
 

Don't Miss