లోపాన్ని జయించి లోకాన్ని చుట్టేసింది..

16:06 - September 21, 2018

పంజాబ్‌ : పంజాబ్‌లోని లూథియానాలో పుట్టింటి.పట్టుదలతో మేటి అనిపించుకుంది.చిన్న వయసులోనే రుమటాయిడ్‌ ఆర్థ్రరయిటిస్‌ శరీరాన్ని కుంగదీస్తున్నా..సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఔరా అనిపించుకుంది. చిన్న చిన్న సమస్యలకు నిండు జీవితాన్ని అంతం చేసుకునే ఆలోచన వున్నవారి ఈమెను చూస్తే ఖచ్చితంగా స్ఫూర్తి పొందుతారు.ఆమే పర్వీందర్‌ చావ్లా
నడవలేదు..కానీ చక్రాల కుర్చీపై 23 దేశాలు పర్యటించిందామె. చిన్న వయసులోనే  రుమటాయిడ్‌ ఆర్థ్రరయిటిస్‌కి గురైంది. 
కనీసం తిండికూడా తనంతట తాను తినలేని అశక్తతతో ఉండే పర్వీకి తల్లే అన్నీ చేసేది. ఆ పరిస్థితితో మంచానికే పరిమితం కానీ పర్వీ డిగ్రీ చేసింది. అనంతరం ఉద్యోగంలో చేరింది. అలా నాలుగుగోడలమధ్యే ఉండిపోకుండా బయటి ప్రపంచాన్ని చూడాలనే కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకుని నిశ్చయించుకుంది. దీంతో కాల్‌సెంటర్‌లో చిన్నపాటి ఉద్యోగం చేస్తునే ఓ కేటరింగ్‌ సర్వీస్‌ను ప్రారంభించి తానే నిర్వహించేది. తరువాత తన స్నేహితులతో కలిసి వెళ్లడానికి సిద్ధమై ప్రయాణంలో అన్ని ఖర్చులను తానే సంపాదించుకుంది. 
స్నేహితులతో గుల్మార్గ్‌, జమ్ము కాశ్మీర్‌ వంటి ప్రాంతాలన్నింటినీ చుట్టి వచ్చింది. అలా వెళ్తున్నప్పుడు తోటి స్నేహితులు తనవల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఓ ఆటోమేటిక్‌ వీల్‌ఛెయిర్‌ను ఏర్పాటు చేసుకుంది. తరువాత ప్రపంచాన్నీ చుట్టిరావాలనే ఆలోచనను కలిగించింది. కనీ ఈసారి ఒంటరిగానే వెళ్లాలనుకుంది.  ట్రావెల్స్‌ సంస్థలు ఆమె పరిస్థిని  చూసి ఒప్పుకోలేదు. అయినా ఆమె మానలేదు. ఒంటరిగా ప్రయాణించేందుకే సిద్ధమయ్యింది.
అలా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో యూరప్‌ దేశాలన్నింటినీ రెండు ,మూడుసార్లు చుట్టి వచ్చిందామె. అలాగే చైనా, రోమ్‌, ఆస్ట్రేలియా, దుబాయ్‌ వంటి 23 దేశాలు పర్యటించింది పర్వీ. అయితే అది చెప్పినంత సులువు కాదు.ఈ నేపథ్యంలో పలు శారీరక సమస్యలను కూడా ఎదుర్కొంది. కానీ దివ్యాంగురాలై కూడా తనకంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా, తనలాంటి   వారిలో స్ఫూర్తిని కలిగించిందీ పర్వీ అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

 

Don't Miss