తెలంగాణ నా రక్తం, గుండెలో ఉంది

Submitted on 13 August 2019
pawan kalyan about telangana

చరిత్ర రాసేవాళ్లు లేకపోతే కనుమరుగు అవుతుందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి రచించిన ''మన సినిమాలు'' పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. గబ్బర్ సింగ్ విజయం కంటే వనవాసి పుస్తకం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పవన్ అన్నారు. జానీ సినిమాలో అనుకున్న కథ తీయలేకపోయాను అని వాపోయారు.

మహానటి సావిత్రి లాంటి సినిమాలు ప్రేరణ కలిగించాయని చెప్పారు. చరిత్రలో ఉయ్యాలవాడ లాంటి ఎన్నో కథలున్నాయని తెలిపారు. సినిమాలు కూడా నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. రాజకీయం కోసం తాను తెలంగాణ భాష మాట్లాడటం లేదన్నారు పవన్. తెలంగాణ అంటే ఇష్టం అని చెప్పారు. నా రక్తం, గుండెలో తెలంగాణ ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రేక్షకులకు సినిమా రహస్యాలు తెలిసిపోయాయని ''మన సినిమాలు'' పుస్తక రచయిత, విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. సినిమాని చులకనగా చూడొద్దని ఆయన కోరారు. మన హీరోలు బాహుబలులే అని ప్రశంసించారు. సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పుస్తకావిష్కరణకు తనికెళ్ల భరణి, పరుచూరి గోపాల కృష్ణ, రావికొండల్ రావు, సుద్దాల అశోక్ తేజ తదితరులు హాజరయ్యారు.

Pawan kalyan
Telangana
Book
Inauguration
mana cinemalu
telakapalli ravi

మరిన్ని వార్తలు