యూపీని నాలుగు ముక్కలు చేయాలి : పవన్

08:39 - November 5, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కడుపు మంటగా వుందని తెలిపారు. అదీ ఎవరిమీదనో తెలుసా? బీజేపీపైనే. బీజేపీపై తనకు చెప్పలేనంత కోపం ఉందన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో మాట్లాడుతు... ఉత్తరప్రదేశ్‌ను నాలుగు చేసే వరకు తన కడుపు మంట చల్లారదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయ నేతలకు బీజేపీని ప్రశ్నించే ధైర్యం లేదని..మీరెవర్రా రాష్ట్రాన్ని విడదీయడానికి అని అడగొద్దా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌ను కూడా అలాగే ముక్కలు చేస్తారా ? అని నిలదీశారు. యూపీని నాలుగు ముక్కలు చేసే వరకు తమ కడుపు మంట చల్లారదని పవన్ పేర్కొన్నారు.
 

Don't Miss