బాలయ్యతో జనక్ జనక్ 'పాయల్' బాజే

Submitted on 16 May 2019
Payal Rajput Opposite Balakrishna in Her Next

జై సింహా తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో, సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించబోయే ప్రాజెక్ట్‌కి సంబంధించి రోజుకో కొత్త వార్త పుట్టుకొస్తుంది. లెజెండ్ తర్వాత జగపతి బాబు ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడని, చిరంతన్ భట్ సంగీతమందిస్తాడని మాత్రమే మూవీ దర్శక, నిర్మాతలు కన్ఫమ్ చేసారు. వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య పక్కన నటించనుందనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిన నిర్మాత సి.కళ్యాణ్, బాలయ్య పక్కన ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్‌ని హీరోయిన్‌గా ఫిక్స్ చేసాడని తెలుస్తుంది.

పాయల్ ప్రస్తుతం 'ఆర్‌డీఎక్స్' అనే సినిమా చేస్తుంది. ఆ సినిమాకి కూడా సి.కళ్యాణే నిర్మాత. వెంటనే పాయల్ పాపకి మరో అవకాశం ఇచ్చాడు. పాయల్, 'ఎన్టీఆర్ కథానాయకుడు'లో బాలయ్య పక్కన ఒక సాంగ్ బిట్‌లో ఆడిపాడింది. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటించబోతుంది. ఈ సినిమా కోసం 'రూరల్' అనే పవర్ ఫుల్ టైటిల్‌ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో పూజాకార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది. 

Nandamuri Balakrishna
Payal Rajput
C.Kalyan
K.S.Ravikumar

మరిన్ని వార్తలు