పేకాటరాయుళ్లను అర్ధనగ్నంగా ఊరేగించిన పోలీసులు

19:55 - September 13, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని చింతలపూడిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం.. వారిని చింతలపూడి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరేగించారు. వీరిని ఇలా అర్థనగ్నంగా ఊరేగించడం బాగాలేదనివాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వీరిని పేకాట ఆడొద్దని పలుమార్లు హెచ్చరించినా... వినలేదని అందుకే ఇలా చేశామని పోలీసులు చెబుతున్నారు. 

 

Don't Miss