మోడీ విమానం పాక్ మీదుగా వెళ్లదు

Submitted on 12 June 2019
PM Modi's plane will not use Pakistan airspace, will fly to Bishkek via Oman for SCO summit

కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌ లో ఈ నెల 13, 14న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌(SCO) సమ్మిట్ కు ప్రధాని మోడీ ప్రయాణించే విమానం పాకిస్థాన్ గగనతలం మీదుగా వెళ్లడం లేదని విదేశాంగ శాఖ సృష్టంచేసింది. మోడీ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లడానికి  పాకిస్థాన్‌ అనుమతించిందన్న వార్తలకు విదేశాంగశాఖ ప్రకటనతో తెర పడింది.

బిష్కెక్‌ వెళ్లాల్సిన వీవీఐపీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం  రెండు మార్గాలను ఎంచుకుంది. మోడీ ప్రయాణించబోయే విమానం ఒమన్‌, ఇరాన్‌, మధ్యఆసియా దేశాల మీదుగా బిష్కెక్‌ కు చేరుకుంటుందని విదేశాంగ శాఖ తెలిపింది.
దేశ ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేసిన పుల్వామా ఉగ్ర ఘటనకు ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్‌ లోని బాలాకోట్ లో జైషే ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. అప్పటి నుంచి పాకిస్థాన్‌ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు మోడీ విమానం పాక్‌ గగనతలం మీదుగా ప్రయాణించడానికి అనుమతించినట్లు ఇటీవల ఓ న్యూస్ ఏజెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Modi
Pak
Aircraft
BISHKEK
Oman
IRAN
VVIP AIRCRAFT
KYRGYZSTAN
use
approved
india
SCO
summit
forign ministrey

మరిన్ని వార్తలు