కాంగ్రెస్ కు ఈవీఎం అనే జ‌బ్బు వ‌చ్చింది

Submitted on 26 June 2019
PM Narendra Modi Slams Congress "Arrogance"

భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించారు. 'ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. దశాబ్ద కాలం తర్వాత బీజేపీ మళ్లీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఇది' అని మోడీ స్పష్టం చేశారు.   

రెండోసారి కూడా బీజేపీకే అధికారం అప్పగించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తమకు ఎక్కువ సీట్లు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఓటమిని తట్టుకోలేని వాళ్లంతా ఓటింగ్ విధానాన్ని, ఓటర్లను నిందిస్తున్నారంటూ.. ఆరోపించారు. 

'కాంగ్రెస్‌కు ఈవీఎం అనే జబ్బు వచ్చింది. గడిచిన ఎన్నికలు 10లక్షల పోలింగ్ స్టేషన్లు, 40లక్షల కంటే ఎక్కువ ఈవీఎం మెషీన్లు, 650 రాజకీయ నాయకులు, 8వేలకు పైగా అభ్యర్థులు కలిసి పోలింగ్‌ ముగిసింది. ఈ విషయాన్ని ప్రజల ముందుంచితే ఎంత గర్వకారణం. అలాంటిది ఈవీఎంల విషయంలో మోసం జరిగిందనడం కరెక్ట్ కాదు'

'అహంకారానికి కూడా ఓ హద్దు అనేది ఉంటుందని..  ఓటర్లను తక్కువ చేసి చూడటం తగదు. కాంగ్రెస్ ఓడినంత మాత్రాన హిందూస్తాన్ ఓడినట్లుకాదని..  ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యానికి చెడ్డ పేరు వస్తుందని' ప్రధాని వెల్లడించారు. 

ఒకే దేశం-ఒకే ఎన్నికల విధానం ఉండాలని కాంగ్రెస్ కావాలనే జమిలి ఎన్నికలపై కాలయాపన చేస్తోందని మోడీ చురకలంటించారు. ఈవీఎంలను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కానీ ఇప్పుడు వారే ఈవీఎంలపై రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.

Narendra Modi
PM Narendra Modi
Modi
india
Congress

మరిన్ని వార్తలు