దేవుడిలా వచ్చాడు : పసిపాప ప్రాణం కాపాడిన పోలీస్

Submitted on 15 July 2019
Police Officer Saves Choking Baby After Pulling Over Speeding Car

తన సమయస్పూర్తితో 12 రోజుల పసిపాపను కాపాడిన ఓ పోలీస్ ఆఫీసర్ పై అధికారులతో పాటుగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ సార్,గుడ్ జాబ్ సార్,రియల్ హీరో అంటూ ఆ పోలీస్ అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన ఓ మహిళ జులై-11,2019న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
Also Read : చిల్లర లేదని తప్పించుకోలేరు: ‘బాబ్బాబూ’E-వాలెట్‌లో భిక్షం వేయండి

అయితే జన్మించిన 12 రోజుల తర్వాత ఆ బిడ్డ పాలు తాగిన తర్వాత శ్వాస ఆడకపోవడంతో ఇబ్బంది పడింది. దీంతో కంగారుపడ్డ ఆ తల్లి తన బిడ్డను తీసుకుని కంగారుగా హాస్పిటల్ కి కారులో బయల్దేరింది. అతి వేగంతో వెళ్తున్న వీరి కారును పోలీసు అధికారి డిప్యూటీ కింబ్రో ఆపాడు. పాపకు ఏమైందిని ఆరా తీయగా.. శ్వాస ఆడడం లేదని ఆమె పోలీసు అధికారికి చెప్పింది. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి డాక్టర్లు వచ్చే వరకు ఆ పోలీసే బిడ్డ ఎదలపై రాస్తూ  నోటిలో వేలి పెడుతూ తీస్తూ శ్వాస ఆడేలా చేశాడు.

అలా సుమారు ఆరు నిమిషాల పాటు చేసి పసిబిడ్డకు ప్రాణం పోశాడు. ఇలా చేస్తున్న క్రమంలో మధ్యమధ్యలో శ్వాస తీసుకున్నప్పుడల్లా పాప ఏడ్చింది. బిడ్డకు ఏమవుతుందోనని తల్లి ఏడుస్తున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కదిలించేలా ఉన్నాయి. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న డాక్టర్లు  బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలను కాపాడారు. పసిపాప ప్రాణాలను కాపాడిన పోలీసు అధికారి కింబ్రోను ఉన్నతాధికారులు మెడల్‌ తో సత్కరించారు. రియల్ హీరో అంటూ అందరూ ఆ పోలీస్ అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : పక్కాగా పట్టేస్తుంది : బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించే AI

Police Officer
CAROLINA
SPEEDIND CAR
PULLED
baby
SAVES
usa

మరిన్ని వార్తలు