స్టార్ హీరోయిన్‌పై ఛీటింగ్ కేసు

Submitted on 12 July 2019
UP Police Visit Sonakshi Sinha's House In Mumbai For Enquiry Into Alleged Cheating Case

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా పై యూపీ పోలీసులు ఛీటింగ్ కేసు న‌మోదు చేశారు. గురువారం (జులై 11, 2019) సాయంత్రం పోలీసులు ముంబైలో ని జుహూలో ఉన్న సోనాక్షి ఇంటికి కేసు దర్యాప్తు చేసేందుకు వెళ్తే ఆ టైంలో సోనాక్షి ఇంట్లో లేదు. 

వివరాల్లోకి వెళ్తే.. 2018లో సోనాక్షి స్జేజి ప్రదర్శన ఇచ్చేందుకు రూ. 24 లక్షలు తీసుకుని కార్యక్రమానికి రాలేదట. అందుకని ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ ప్ర‌మోద్ శ‌ర్మ ఆమెపై మోర‌ద‌బాద్‌లో కేసు న‌మోదు చేశాడు. దీంతో సినీనటి సోనాక్షిసిన్హాపై యుపి పోలీసులు ఐపిసి సెక్షన్‌ 420, 406ల కింద కేసు నమోదు చేశారు.
 
అయితే ఈ రోజు (జులై 12, 2019) యూపీ పోలీసులు మ‌రోసారి సోనాక్షి ఇంటికి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం సోనాక్షి ద‌బాంగ్ 3, కందానీ ష‌వాఖానా, మిష‌న్ మంగ‌ళ్‌, భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

up police
Sonakshi Sinha
Mumbai
Cheating Case

మరిన్ని వార్తలు