ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ కట్ : నలుగురు పేషెంట్లు మృతి

Submitted on 13 June 2019
power cut ..four patients who are being treated on the ventilator have died in government hospital

విజయవాడ : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం నలుగురి ప్రాణాలు తీసింది. బుధవారం (జూన్ 12) రాత్రి  కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న నలుగురు పేషెంట్లు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు ఉన్నారు. వీరు ఓ ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇంత దారుణం జరిగిందని మృతుల బంధువులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని...తమకు న్యాయం చేయాలంటు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వెంటనే వైద్య సిబ్బంది జనరేటర్ ఆన్ చేస్తే ఇంత ఘోరం జరగకపోయేదని మృతుల బంధువులు వాపోతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బైటపడిన తమ కుమారులను ఆస్పత్రిలో చేర్పించామనీ..కానీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే వారు మృతి చెందారని యువకుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంత జరిగినా ఆస్పత్రి అధికారులు మాత్రం ఏమాత్రం స్పందిచటంలేదు. 

AP
vijayawada
5 minutes power cut
four ventilator patients
died

మరిన్ని వార్తలు