జేడీఎస్ కు మేం ఆఫర్ చేయలేదు: జవదేకర్

18:54 - May 16, 2018

కర్ణాటక : తమ పార్టీ ఎమ్మెల్యేలకు వంద కోట్ల రూపాయలు, మంత్రి పదవి ఇస్తామని బిజెపి ప్రలోభ పెట్టిందని జెడిఎస్‌ చీఫ్‌ కుమారస్వామి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఖండించారు. ఇది ఊహా జనితమని, కాంగ్రెస్‌-జెడిఎస్‌లు ఇలాంటి రాజకీయాలే చేస్తారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్‌ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కర్ణాటక ప్రజలు బిజెపికే పట్టం కట్టారని, యడ్యూరప్ప నేతృత్వంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జవదేకర్‌ చెప్పారు.

Don't Miss