వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి

Submitted on 14 August 2019
Pregnant woman dies due to negligence of doctors

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వైద్యులు నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. మెళియాపుట్టి మండలం బాణాపురం గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే గర్భిణి ప్రసవం కోసం ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. 
అయితే ఆమెకు నొప్పులు రావట్లేదంటూ వైద్యులు కాలక్షేపం చేశారు. అర్ధరాత్రి ఒకేసారి పురిటినొప్పులు అధికం కావడంతో పరిస్థితి విషమించి తల్లీబిడ్డ చనిపోయారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యానికి నిరసనగా బాణాపురం ప్రధాన రహదారిపై మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

pregnant woman
dies
negligence
Doctors
Srikakulam
Primary Health Center

మరిన్ని వార్తలు