విక్కీ కౌశల్ 'భూత్' ఫస్ట్ లుక్

Submitted on 12 June 2019
Presenting Bhoot : Part One - The Haunted Ship! The FIRST in the Franchise

మసాన్, రాజీ, సంజు వంటి డిఫరెంట్ మూవీస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్.. 'ఉరీ : ది సర్జికల్ స్ట్రెక్స్' సూపర్ హిట్ అవడంతో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు మరో కొత్త జోనర్‌లో నటిస్తున్నాడు విక్కీ..

భాను ప్రతాప్ సింగ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధర్మా ప్రొడక్షన్స్ సమర్పణలో, హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శశంకా కైతాన్ నిర్మిస్తున్నారు. ఈ హారర్ మూవీకి 'భూత్' : పార్ట్ వన్. హాంటెడ్ షిప్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.. భూమి పెడ్నేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది..

ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 15న రిలీజ్ చెయ్యనున్నారు. భూత్ సిరీస్‌ను కంటిన్యూ చేద్దామనుకుంటున్నాం, అడగ్గానే భూత్ టైటిల్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మకు థ్యాంక్స్ అని కరణ్ జోహార్ తెలిపారు. 

Vicky Kaushal
Bhumi Pednekar
Dharma Productions
Bhanu Pratap Singh

మరిన్ని వార్తలు