కశ్మీరీలకు మెరుగైన భవిష్యత్...జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

Submitted on 14 August 2019
President Ram Nath Kovind addresses the nation on the eve of the 73rd Independenceday

73వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చి నేటితో 72 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైన సందర్భమని కోవింద్ అన్నారు. మహాత్మాగాంధీ కృష్టి, పట్టుదల, అకుంఠిత దీక్షతో బ్రిటీష్ పాలన నుంచి భారత్ కు విముక్తి కలిగిందని రాష్ట్రపతి చెప్పారు. మరికొన్ని వారాల్లో అక్టోబర్ 2న జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు జరుగునున్నాయన్నారు.

ఇటీవల జమ్మూకశ్మీర్, లఢఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడంతో..ఆయా ప్రాంతాల ప్రజలు మెరుగైన భవిష్యత్ ను అందుకోనున్నారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు, వసతులు ఉన్నాయో..ఇక నుంచి జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రజలు కూడా అన్ని హక్కులు, సౌకర్యాలు పొందుతారని తెలిపారు. ఈ ఏడాది ప్రఖ్యాత సిక్కు గురువు గురునానక్ 550వ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించుకున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది సమ్మర్ లో దేశ ప్రజలు 17వ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. మానవ చరిత్రలో ఇదో పెద్ద ప్రజాస్వామ్య ఎక్సర్ సైజ్ అన్నారు. దీనికి కారణమైన ఓటర్లను మొదటగా అభినందించాలన్నారు. చాలా ఉత్సాహంతో ప్రజలు పోలింగ్ స్టేషన్ లకి వెళ్లి ఓటు వేసి వచ్చారన్నారు.

independence day
President
kovind
Address
Nation
JAMMU KASHMIR
congratulate
voters

మరిన్ని వార్తలు