చ‌ల్ల‌గుండు బిడ్డా : అమ్మ ఆశీర్వాదం తీసుకున్న మోడీ

Submitted on 26 May 2019
Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence in Gandhinagar and seeks her blessings

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత  సొంత రాష్ట్రం గుజరాత్ వెళ్లి త‌ల్లి హీరాబెన్ మోడీ
 ఆశీర్వాదం తీసుకున్నారు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ.ఆదివారం(మే-26,2019)సాయంత్రం గాంధీన‌గ‌ర్ వెళ్లి త‌ల్లి పాదాల‌కు న‌మ‌స్క‌రించి ఆమె బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.అమ్మతో కొద్ది సేపు మాట్లాడారు.ఆమె ఆరోగ్యవివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు మోడీ.

అంత‌కుముందు అహ్మ‌దాబాద్ లో పర్య‌టించిన మోడీ  భావోద్వేగంతో మాట్లాడారు.తనను పోషించిన గడ్డకు, తనకు గాఢానుబంధం ఉన్న ప్రదేశానికి మళ్ళీ వచ్చానన్నారు. గుజరాతీలను దర్శనం చేసుకోవడానికి వచ్చినట్లు చెప్తూ, వారి ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైనవని తెలిపారు.రాబోయే ఐదేళ్ళ కాలాన్ని సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలన్నారు. ప్రపంచంలో భారత దేశ స్థాయిని మరింత వృద్ధి చేయాలని మోడీ అన్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గుజ‌రాత్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే.

Narendra Modi
heraben modi
BLESSINGS
GANDHINAGAR
residence
meet
grand victory

మరిన్ని వార్తలు