జిన్ పింగ్ తో సమావేశమైన ప్రధాని మోడీ

Submitted on 13 June 2019
Prime Minister Narendra Modi meets President of China Xi Jinping on the sidelines of the SCO Summit

కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్‌ లో గురువారం(జూన్-13,2019),శుక్రవారం(జూన్-14,2019) జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌(SCO) సమ్మిట్ కు హాజరయ్యేందుకు  బిష్కెక్‌ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమయ్యారు.జిన్ పింగ్ తో మోడీ ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు.మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదంపై నేతలు చర్చించారు.ఉగ్రవాదం అరికట్టేందుకు పాక్ చాలా చెయ్యాల్సి ఉందని మోడీ,జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు.పాకిస్థాన్ పై భారత్ వైఖరి మారలేదని మోడీ తెలిపారు. మోడీ ఆహ్వానం మేరకు ఈ ఏడాది భారత్ లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటించనున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది.

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత తనకు మెసేజ్ పంపిన జిన్ పింగ్ కు మోడీ ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. మ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో కూడా మోడీ సమావేశమవనున్నారు. అంతకుముందు బిష్కెక్ ఎయిర్ పోర్ట్ లో మోడీకి కిర్గిస్తాన్ అధికారులు,నాయకులు ఘనస్వాగతం పలికారు కిర్గిస్తాన్ దేశపు స్వీట్లను మోడీ టేస్ట్ చేశారు. సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో కూడా మోడీ సమావేశమవనున్నారు.

China
President
XI JINPING
meet
Modi
thanked
after general elections
delegation level talks
SCO
summit
KYRGYZSTAN

మరిన్ని వార్తలు