ఇది చారిత్ర‌క విజ‌యం : రానున్న ఐదేళ్లు సామాన్యుల కోసమే

Submitted on 26 May 2019
Prime Minister Narendra Modi waves at BJP supporters outside the party office in Ahmedabad

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత మొద‌టిసారి సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగంతో మాట్లాడారు.అహ్మ‌దాబాద్ లో భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతున్న స‌మ‌యంలో మోడీ గత స్మృతులను  గుర్తు చేసుకున్నారు. గుజ‌రాత్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే.

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గ్రాండ్ విక్ట‌రీ త‌ర్వాత మొద‌టిసారి అహ్మ‌దాబాద్ లో  ప‌ర్య‌టించిన‌ మోడీ మాట్లాడుతూ. సూర‌త్ లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం ఘ‌ట‌న త‌మ‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింద‌న్నారు.బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌న్నారు.తనను పోషించిన గడ్డకు, తనకు గాఢానుబంధం ఉన్న ప్రదేశానికి మళ్ళీ వచ్చానన్నారు. గుజరాతీలను దర్శనం చేసుకోవడానికి వచ్చినట్లు చెప్తూ, వారి ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. ఖాన్ పూర్‌లో ఉన్న బీజేపీ కార్యాలయంలోనే తాను సంఘటన సంస్కారాన్ని నేర్చుకున్నట్లు తెలిపారు. 2012లో ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ గెలిచిన తర్వాత మీ అందరితో కలిసి రావడం నాకు ఇంకా గుర్తు ఉంది అని మోడీ అన్నారు. 

2014 లోక్‌సభ ఎన్నికల స‌మ‌యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు గుజరాత్ లో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకున్నారన్నారు. 2019లో తన నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల సానుకూలతతో ఓట్లు వేశారన్నారు. ఇది చారిత్రక విజయమని చెప్పారు. రాబోయే ఐదేళ్ళ కాలాన్ని సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలన్నారు. ప్రపంచంలో భారత దేశ స్థాయిని మరింత వృద్ధి చేయాలని మోడీ అన్నారు.

Modi
loksabha elections
Gujarat
Victory
Development
Ahmedabad
huge
fire tragedy
Surat
GUJARATIS
ASHIRWAD
Special

మరిన్ని వార్తలు