కిర్గిస్తాన్ లో మోడీకి ఘనస్వాగతం

Submitted on 13 June 2019
Prime Minister Narendra Modi is welcomed by dignitaries upon his arrival in Bishkek, Kyrgyzstan

కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్‌ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.మోడీకి కిర్గిస్తాన్ అధికారులు,నాయకులు ఘనస్వాగతం పలికారు.కిర్గిస్తాన్ దేశపు స్వీట్లను మోడీ టేస్ట్ చేశారు. గురువారం(జూన్-13,2019),శుక్రవారం(జూన్-14,2019) జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌(SCO) సమ్మిట్ కు ప్రధాని మోడీ హాజరవనున్నారు.సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్,చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

బిష్కెక్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు మోడీ విమానం పాక్‌ గగనతలం మీదుగా ప్రయాణించడానికి పాకిస్తాన్ అనుమతించినట్లు ఇటీవల ఓ న్యూస్ ఏజెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే మోడీ ఎయిర్ క్రాఫ్ట్ పాక్ గగనతలం మీదుగా వెళ్లదని బుధవారం విదేశాంగశాఖ సృష్టం చేసిన విషయం తెలిసిందే. మోడీ ప్రయాణించబోయే విమానం ఒమన్‌, ఇరాన్‌, మధ్యఆసియా దేశాల మీదుగా బిష్కెక్‌ కు చేరుకుంటుందని విదేశాంగ శాఖ తెలిపిన విషయం తెలిసిందే..

KYRGYZSTAN
Aircraft
Modi
arrive
DIGNITARIES
welcome
BISHKEK
BILATERAL MEETINGS
Putin
XI JINPING
SCO
summit

మరిన్ని వార్తలు