డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు : ఒకరు మృతి

Submitted on 13 June 2019
private travels bus hit dcm van

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీఎం వ్యాన్ ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. 9మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని దుర్గమ్మ(62)గా గుర్తించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్తోంది. గురువారం (జూన్ 13,2019) ఉదయం ఈ ఘటన జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. నియమ నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడం కోసం ప్యాసెంజర్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆశ్రయిస్తున్నారు. టికెట్ల రూపంలో వేలకు వేలు వసూలు చేసే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికుల భద్రత విషయాన్ని గాలికొదిలేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రయాణికుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో జర్నీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

private travels bus
hit
dcm van
road accident
suryapeta
passenger die
injure

మరిన్ని వార్తలు