సొరియాసిస్ సమస్యకు ఇక చెక్!

Submitted on 8 June 2019
Psoriasis: Symptoms,Types  And Treatment

సొరియాసిస్ వ్యాధి ఏర్పడటానికి మానసిక ఒత్తిడి నుంచి ఇన్ఫెక్షన్ల వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. వంశపారంపర్యంగా కూడా సొరియాసిస్ రావచ్చు. అసలు సొరియాసిస్ ఎందుకొస్తుందనే విషయంలో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయితే సొరియాసిస్ ఎక్కువకాలం బాధిస్తుంటే అది సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా మారుతుంది. దీనివల్ల వీళ్లలో కీళ్లనొప్పులు వస్తాయి. సొరియాసిస్ వల్ల కీళ్లు, మోకాళ్లు, అరికాళ్లలోని కీళ్లు ప్రభావితం కావొచ్చు. లేదా అన్ని జాయింట్లూ ఎఫెక్ట్ కావొచ్చు. అదెలాగంటే, చర్మ కణాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు, ఆ కణాలపై అనేక పొరలు ఏర్పడతాయి. తద్వారా చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడడం వంటివి మొదలవుతాయి. ఇలా చర్మంపై దద్దుర్లు ఏర్పడే చర్మరుగ్మతనే సొరియాసిస్ అంటారు.

ఏది ఏమైనా సొరియాసిస్ బారి నుంచి పూర్తిగా తప్పించుకోవడం సాధ్యం కాకపోయినా వ్యాధి ముదరక ముందే డాక్టర్ ని కలిస్తే కాంప్లికేషన్లు రాకుండా ఉంటాయి. వ్యాధి ప్రారంభంలోనే డాక్టర్ ని కలవాలి. దీర్ఘకాలిక వ్యాధి అయిన సొరియాసిస్ బాధలు తగ్గాలంటే సాధ్యమైనంత వరకు రిస్క్ కారకాలకు దూరంగా ఉండాలి. దీనికి పూర్తిస్థాయిలో చికిత్స అనేది లేదు. కాని కొన్ని చికిత్స పద్ధతుల ద్వారా వ్యాధి తీవ్రం కాకుండా చూడడమే కాకుండా, వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తారు. ఆ పద్ధతులేంటో, తీవ్రం కాకుండా ఏం చేయాలో తెలుసా..?

* నివారణ.. 
సొరియాసిస్‌ను అదుపులో పెట్టేందుకు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ముఖ్యంగా మామిడి, కార్న్, చిలగడ దుంప, క్యారెట్స్, టొమాటో, ఆకుకూరల వంటివి తీసుకోవాలి. అంతేకాదు శారీరక వ్యాయామం తప్పకుండా చేయాలి. సొరియాసిస్‌కు రెమెడీస్‌గా చెప్పేవాటిల్లో ఆర్సెనిక్ ఆల్బమ్, సల్ఫర్, కాలిబ్రమ్, కాలిఆర్స్, థైరాడినమ్ రేడియం బ్రమ్ మొదలైనవి ఉన్నాయి. కొన్ని ఆహారాలు సొరియాసిస్ వ్యాధిని ప్రేరేపించేవిగా ఉంటాయి. అటువంటి వాటిని గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. వాటిలో ఆల్కహాల్, జంక్‌ఫుడ్, మాంసం వంటివి సమస్యను మరింత తీవ్రం చేయగలవు.

Psoriasis
symptoms
Types And Treatment
2019

మరిన్ని వార్తలు