కొత్త గాడ్జిల్లా థీమ్ : PUBG మొబైల్ 0.13.0 అప్ డేట్ రిలీజ్ 

Submitted on 11 June 2019
PUBG Mobile 0.13.0 update to be released on June 12, will bring Godzilla to your mobile

చైనా టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ప్లేయర్ అన్ నౌన్స్ బాటిల్ గ్రౌండ్స్ (PUBG) మొబైల్ కొత్త అప్ డేట్ రిలీజ్ చేయనుంది. జూన్ 12న పబ్ జీ మొబైల్ 0.13.0 స్టేబుల్ అప్ డేట్ ను ప్రవేశపెట్టనుంది. పబ్ జీ గేమ్ ప్లేయర్లకు గేమ్ ఆరంభంలో ఓ నోటీసు రిలీజ్ చేసింది.

ఈ కొత్త అప్ డేట్ ను లోడ్ చేసే సమయంలో కంపెనీ మెయింట్ నెన్స్ కోసం 00:00:00 నుంచి 08:00:00 UTC సమయం వరకు సర్వర్లను ఆఫ్ లైన్ లోకి ఉంచనుంది. ఒకసారి మెయింట్ నెన్స్ పూర్తి అయ్యాక.. పబ్ జీ ప్లేయర్లు.. అప్ డేట్ ప్యాచ్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

PUBG మొబైల్ 0.13.0 అప్ డేట్ ఆండ్రాయిడ్ పై 1.98 GB సైజులో ఉంటుంది. iOS డివైజ్ ప్లేయర్ కు 2.45GB సైజులో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 19లోగా గేమ్ ప్లేయర్లు అప్ డేటడ్ వెర్షన్ గేమ్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా ప్లేయర్లు ఫ్రీ ఔట్ ఫిట్ బాక్స్ III, 1,888 BP (బాటిల్ పాయింట్స్) పొందే అవకాశం ఉంటుంది.

పబ్ జీ మొబైల్ 0.13.0 అప్ డేట్ ద్వారా కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్లలో కొత్త డెత్ మ్యాచ్ గేమ్ మోడ్, గో అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్, న్యూ చీట్ ప్రెవెన్షన్ సిస్టమ్, MVP షోకేస్ సిస్టమ్, డైనమిక్ ఫుట్ ఫ్రింట్స్, ట్రాక్స్, వికెండీ మ్యాప్, కొత్త చారిస్మా ర్యాంకింగ్ ఎణ్నో ఉన్నాయి. 

ఈ కొత్త పబ్ జీ గేమ్ అప్ డేట్ లో గాడ్జిల్లా 2 కింగ్ ఆఫ్ మానిస్టర్స్ కూడా వస్తోంది. క్రాస్ ఓవర్ ఈవెంట్ PUBG X గాడ్జిల్లా 2 కింగ్ ఆఫ్ మానిస్టర్స్ పేరుతో రానుంది. కొత్త గాడ్జిల్లా థీమ్ వంటి ఎన్నో కొత్త ఫీచర్లను గేమ్ ప్లేయర్ల కోసం రివీల్ చేయనున్నారు.

పబ్ జీ మొబైల్ గేమ్ నుంచి టిల్ డాన్ మోడ్, టైరంట్, జి, లిక్కర్, జాంబీ కాప్ క్యారెక్టర్లను కంపెనీ తొలగించింది. వీటి స్థానంలో గేమ్ మేకర్.. 4 కొత్త జాంబీలను చేర్చనుంది. జాంబీలకు సమీపంలో ఉన్న వార్ ట్యాంకును పెద్దదిగా చేయడమే కాదు.. ఇప్పుడు స్కిన్నర్ కు సమీప ప్లేయర్ల మూమెంట్ స్పీడ్ తగ్గించే సామర్థ్యం కలదు. 

PUBG Mobile
Godzilla Theme
0.13.0 update
MVP
PUBG Mobile servers
PUBG X Godzilla Theme 

మరిన్ని వార్తలు