కొండచిలువతో పోరాటం : గాయాలతో బయటపడిన మేకలకాపరి

Submitted on 14 August 2019
The python attacked on a shepherd

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో భారీ కొండచిలువ ... మేకను మింగేందుకు యత్నించింది. ఈ విషయాన్ని గమనించిన మేకల కాపరి .. కొండచిలువ నుంచి మేకను తప్పించేందుకు యత్నించాడు. 

దీంతో కొండచిలువ మేకల కాపరిపై దాడికి తెగబడింది. అతడిని చంపేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన మేకలకాపరి... గాయాలతో కొండచిలువ నుంచి తప్పించుకున్నాడు. 

ఆ తర్వాత ఇతర మేకల కాపరులకు సమాచారం ఇవ్వడంతో వారంతా కలిసి కొండచిలువను చంపేశారు. కొండచిలువ దాడిలో మేక కూడా చనిపోయింది. 
Also Read : వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి

Python
attacked
shepherd
rajanna sirisilla

మరిన్ని వార్తలు