కదులుతున్న రైలు ఎక్కబోయి...మహిళ ప్రాణాలు కాపాడిన జవాన్

Submitted on 12 July 2019
A Railway Protection Force (RPF) jawan saved a woman who fell off the platform

కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ ప్రయాణికురాలు ప్రమాదవశాత్తూ ప్లాట్‌ ఫాం మీద జారిపడింది.వెంటనే గమనించిన ఓ జవాన్‌, మరికొందరు  ఆమెను పైకి లాగడంతో ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది. 

గురువారం(జులై-11,2019) రాత్రి గుజరాత్ లోని అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్ లో పెద్ద బ్యాగ్‌ తో ఓ ప్రయాణికురాలు కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తూ ప్లాట్‌ ఫాం నుంచి రైలు కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఓ ఆర్‌పీఎఫ్‌ జవాన్‌తో పాటు మరికొందరు ఆమెను పైకి లాగారు. దీంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.కదులుతున్న రైలు ఎక్కవద్దని అధికారులు ఎంత మొత్తుకుంటున్నా ప్రయాణికులు వాటిని పెడచెవిన పెడుతూనే ఉన్నారు.

RPF JAWAN
train
moving
AHMADABAD
Women
saved
PLATFORM
board


మరిన్ని వార్తలు