వరల్డ్ కప్ టోర్నీకి వర్షం బెడద : సెమీస్ కు వరుణుడు క్వాలిఫై!

Submitted on 12 June 2019
Rain will qualify for semis best memes on rain disrupting the Cricket World Cup

వరల్డ్ కప్ టోర్నీకి వర్షం బెడద పట్టకుంది. టోర్నీ ఆరంభం నుంచి వరుణుడు ఏదొక మ్యాచ్ కు అడ్డంకిగా నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మూడు మ్యాచ్ లు వర్షార్పణమయ్యాయి.
మంగళవారం శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒక బంతి పడకుండానే రద్దు అయింది.

వరుసగా వర్షం కారణంగా మ్యాచ్ లు రద్దు కావడంపై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ లను రిజర్వ్ డే చేయాలని అడుగుతున్నారు. మెగా టోర్నమెంట్ ప్లానింగ్ కు ముందే వాతావరణాన్ని కూడా ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

మంచిగా ఉండే ఇంగ్లీష్ సమ్మర్ కు ఏమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్ లు నిర్వహించేందుకు తాత్కాలిక వేదికలను షేర్ చేస్తున్నారు. చాలామంది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా క్రికెట్ గవర్నింగ్ బాడీ ఐసీసీపై షేరింగ్ మెమీస్ తో ట్రోలింగ్ చేస్తున్నారు.

మరికొంతమంది 2019 వరల్డ్ కప్ టోర్నీలో వరుణుడే విజయం సాధిస్తాడని కామెంట్ పెట్టారు. వరల్డ్ కప్ ట్రోఫీపై భాగంలో గొడుగు ఉండేలా రీమోడల్ చేయాలని సూచిస్తున్నారు. వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి ఫన్నీ మెమీలను క్రికెట్ ఫ్యాన్స్ షేర్ చేశారు. 

rain
Qualify semis
best memes
rain disrupting
cricket World Cup 2019

మరిన్ని వార్తలు