గోళ్లు పీకేసి..దారుణంగా : దళిత మహిళపై పోలీసుల గ్యాంగ్ రేప్!

Submitted on 14 July 2019
Rajasthan: After brother-in-law died in custody, Dalit woman alleges gangrape by cops

రాజస్థాన్ లోని చురూ జిల్లాలో దళిత మహిళపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. దొంగతనం చేశారంటూ దళితులైన మరిది, వదినను అరెస్టు చేసిన కేసులో.. కస్టడీలో ఉన్న మరిది చనిపోవడం, పోలీసులు తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ వదిన వాంగ్మూలం ఇవ్వడం రాజస్థాన్‌లో సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ రాజేంద్రకుమార్ శర్మతో పాటు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ఆరుగురు కానిస్టేబుళ్లను సస్సెండ్‌ చేసింది. అంతేకాక, జిల్లా అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌తో విచారణకు ఆదేశించింది. 

చురు జిల్లా పోలీసులు జూన్-30,2019న దొంగతనం కేసులో నా తమ్ముడి(22)ని అనుమానితుడిగా తమ అదుపులోకి తీసుకున్నారు.జులై-3,2019 మళ్లీ వచ్చి అదే కేసులో నా భార్య(35)ను తీసుకెళ్లారు. ఆ తర్వాత జులై-6,2019వ తేదీ రాత్రి నా తమ్ముడిని చిత్ర హింసలు పెట్టి చంపేశారు. ఈ ఘటనకు సాక్ష్యంగా ఉన్న నా భార్యపై సామూహికంగా అత్యాచారం చేసి, చేతి గోర్లను పీకేసి హింసించారు. ఎనిమిది రోజుల పాటు నా భార్యను అక్రమంగా నిర్బంధించి తమ్ముడు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత జులై-10,2019న విడిచిపెట్టారు’ అని మృతుని సోదరుడు శనివారం(జులై-13,2019) జైపూర్ లో మీడియాకు తెలిపారు. మృతుని సోదరి మాట్లాడుతూ..జులై-6,2019న తన తమ్ముడిని గ్రామానికి తీసుకొచ్చి ఇదే నీ చివరి చూపని చెప్పారని విలపిస్తూ చెప్పింది. 8 రోజుల తర్వాత వచ్చిన వదిన ఆరోగ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పింది.

ఈ దొంగతనం కేసులో మరిది, వదినలను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి చార్జిషీట్‌ దాఖలు చేయలేదని తమ దృష్టికి వచ్చిందని చురు జిల్లా అదనపు ఎస్పీ ప్రశాంత్‌ కుమార్‌ శర్మ తెలిపారు. మృతుని పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందనీ, మహిళను ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రిలో చేర్చామన్నారు. సామూహిక అత్యాచారం కేసులో బాధిత మహిళ వాంగ్మూలం తీసుకున్నామనీ, ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని క్రైమ్‌ బ్రాంచ్‌ అదనపు డీజీపీ బీఎల్‌ సోనీ తెలిపారు.

rajastan
GANGRAPE
DALIT WOMEN
custody
theft case
Arrest
sp
suspend
churu
died

మరిన్ని వార్తలు