రాజ్ ‌దూత్ మూవీ రివ్యూ

Submitted on 12 July 2019
Rajdoot Movie Review and Rating, Meghamsh Srihari

మేఘాంశ్ హీరోగా, కార్తీక్, అర్జున్ సంయుక్త దర్శకత్వంలో వచ్చింది మూవీ రాజ్ దూత్. శ్రీహరి తనయుడు మేఘాంశ్ డెబ్యూ మూవీ కావడంతో.. ట్రైలర్లు టీజర్లతో బజ్ క్రియేట్ చేసుకుంది. వారసుడిగా ఎంటర్ అయిన మేఘాంశ్ కు ఎలాంటి రిజల్ట్ ను ఇచ్చిందో చూద్దాం.

కథ విషయానికి వస్తే 
హీరో సంజయ్.. ఎలాంటి భాత్యతా లేకుండా జాలీగా లైఫ్ గడిపేస్తూ ఉంటాడు. నాన్న స్నేహితుడి కూతురైన ప్రియాని ప్రేమిస్తాడు. సంజయ్ బిహేవియర్ నచ్చని ప్రియా తండ్రి.. తన కూతురితో పెళ్ళికి ఓప్పుకోడు. అయినా కూడా సంజయ్.. ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతని పట్టుదల చూసి ప్రియా తండ్రి ఓ ఆఫర్ ఇస్తాడు. దూరమైన రాజ్ తూత్ బైక్ తెచ్చిపెట్టాలని.. అందులో సక్సెస్ అయితే నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెబుతాడు. ఆ బైక్ ను వెతుక్కుంటూ బయలుదేరిన సంజయ్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. అసలు ప్రియా ఫాదర్ ఈ రాజ్ దూత్ ను ఎందుకు తెమ్మని అడిగాడు.. బైక్ దొరికిందా లేదా అనేది మూవీ స్టోరీ.

నటీనటుల విషయానికి వస్తే..

శ్రీహరి వారసుడిగా పరిచయం అయిన మేఘాంశ్ పర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకున్నాడు. సంజయ్ పాత్రలో.. సూట్ అయ్యాడు. డైలాగ్ డెలివరీతో పాటు.. పలికించిన హావభావాలు పర్వాలేదు. ప్రియా పాత్రలో నటించిన నక్షత్రకు పర్ఫామెన్స్ కు స్కోప్ లేని లిమిటెడ్ రోల్. కీలకమైన పాత్రలో నటించిన ఆధిత్య మీనన్ రాజన్న పాత్రలో ఒదిగిపోయాడు. ఈ పాత్ర సినిమాకు ప్లస్. హీరో ప్రెండ్ గా నటించిన సుదర్శన్ కామెడీ పెద్దగా పేలలేదు. కోటా శ్రీనివాసరావు, ఏడిద శ్రీరామ్, దేవీ ప్రసాద్, మనోబాల, హరీష్ కురువెళ్ళ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. అర్జున్ కార్రీక్ అనే ఇద్దరు కొత్త దర్శకులు ఈ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బాగున్నప్పటికీ.. కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా నడిపించడంలో తడబడ్డారు. లాజిక్ లేని సీన్స్.. కథకు సంబంధం లేని సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. సినిమా లెంత్ కూడా ఎక్కువైంది. కెమేరా వర్క్ బాగుంది. మ్యూజీక్ మోస్తరుగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.

ఒవరాల్ గా చెప్పాలంటే శ్రీహరి తనయుడు మేఘాంశ్ డెబ్యూ మూవీ అయిన దాజ్ దూత్.. నటన పరంగా హీరోకి మంచి మార్కులే పడ్డాయి. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

rajdoot
movie
review
rating
Meghamsh Srihari


మరిన్ని వార్తలు