నా ఫస్ట్ పోస్ట్ అమ్మకి అంకితం: రామ్ చరణ్

Submitted on 12 July 2019
http://www.10tv.in/node/17091/edit

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ శుక్రవారం (జూలై 8, 2019) ఇన్‌స్టాగ్రామ్‌ లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. @alwaysramcharan పేరుతో ఈ అకౌంట్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లో జాయిన్ అయిన చెర్రీ తను నటించిన సూపర్ హిట్ మూవీ 'రంగస్థలం'  సినిమా నుంచి గడ్డం లుక్‌తో ఉన్న తన ఫోటోను షేర్ చేస్తూ..దానినే ప్రొఫైల్ పిక్చర్‌ గా పెట్టారు.

అయితే చెర్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ముందుగా పోస్ట్ చేసిన పిక్‌ ని డిలీట్ చేసి ఇప్పుడు తొలి పోస్ట్‌ గా తన తల్లితో చిన్నప్పుడు, ఇప్పుడు దిగిన రెండు ఫొటోలను మిక్స్ చేసి అప్‌లోడ్ చేశాడు. అంతేకాదు నా ఫస్ట్ పోస్ట్ ని అమ్మకి అంకితం చేస్తున్నాను అని కామెంట్ పెట్టాడు. ఇక సినిమాల విషయానికి వస్తే చెర్రీ ప్రస్తుతం రాజ‌మౌళి క్రేజీ ప్రాజెక్ట్ RRR సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 

Ram Charan
First Instagram Post
Dedicated To Her Mother


మరిన్ని వార్తలు