కమ్మ రాజ్యంలో కడప రెడ్లు : RGV కొత్త సినిమా

Submitted on 26 May 2019
Ram Gopal Verma announces his next title 

విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తర్వాత సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. "కమ్మరాజ్యంలో కడప రెడ్లు" అనే పేరుతో సినిమా తీస్తున్నట్లు ఆదివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమామవేశంలో ప్రకటించారు.  వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే31న  ఏపీ లో విడుదలవుతున్న సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ...వెన్నుపోటు, అబద్దాలు, చెప్పినవి అమలు పరచకపోవటం, వైఎస్ జగన్, లోకేష్ లే చంద్రబాబు ఓటమికి కారణాలని చెప్పారు. తానెప్పుడూ  ఇష్యూని కాంట్రవర్సీ చేయనని, కాంట్రవర్శీ అయిన ఇష్యూనే సినిమాగా తీస్తానని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఎన్టీ ఆర్, లక్ష్మీపార్వతిల విషయంలో చంద్రబాబే కాంట్రవర్శీ చేశారన్నారు ఆర్జీవి. 

ఎన్నికల ముందు ఏపీలో  సినిమా అడ్డుకుంటారని మేము అనుకోలేదని, కొందరు వ్యక్తుల వల్ల సినిమా ఆగిందని అన్నారు. "ఆటైమ్ లో సైకిల్ స్పీడ్ గా తిరుగుతోంది కాబట్టి, పంచర్ అయ్యేంతవరకు ఆగాను" అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నిజాలు చెప్పడానికి ప్రయత్నించాం, అవి కొందరికి నచ్చలేదు. సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారు. ఏపీలో  ఈనెల 31న ఆ నిజాలు చూపిస్తాం అన్నారు. 70 సంవత్సరాలు మహారాజులాగా, చక్రవర్తిలాగా బతికిన మనిషి చివరి రోజుల్లో  చాలా దారుణంగా చనిపోయారు. దానికి కారణం ఎవరనేది అందరికీ తెలియాలనే నేను సినిమా తీశాను. టీడీపీ వాళ్లు ఎన్టీఆర్  పోయిన 25 ఏళ్లకు కూడా ఆయన ఫోటో పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగుతున్నారని వర్మ మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పొలిటికల్ సినిమా కాదు. ఎన్టీఆర్ గారి వెనుకాల జరిగిన కుట్రలు బయటపెట్టే ప్రయత్నం అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

vijayawada
Chandrababu Naidu
Andhra Pradesh
Ram Gopal Varma
Lakshmi's NTR
Lakshmi's NTR Movie

మరిన్ని వార్తలు