కన్నడ "రంగస్థళ" రిలీజ్

Submitted on 12 July 2019
Rangasthalam Movie Released in Kannada

క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా రంగస్థలం. ఈ మూవీ 2018లో విడుదలై టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. జ‌గ‌ప‌తి బాబు ఆది పినిశెట్టి, అన‌సూయ కీల‌క పాత్ర‌ల‌లో నటించారు.

కన్నడలో డబ్ అయిన ఈ మూవీ ఇవాళ (జులై 12, 2019)రిలీజ్ అయింది. క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఈ మూవీని  85 స్క్రీన్స్‌లో విడుద‌ల చేయ‌గా, ఒక్క బెంగ‌ళూర్‌లోనే తొలి రోజు 26 షోస్ ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యాయి. మైత్రి మూవీ మేక‌ర్స్, జేఎమ్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని రంగ‌స్థ‌ళ పేరుతో రిలీజ్ చేశారు.  

ఇక తెలుగులో అయితే రంగస్థలం 100 కోట్ల క్లబ్ లో చేరి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టింది. ఇప్పడు క‌న్న‌డ‌లో కూడా చిట్టిబాబు మోత మోగించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమా అక్క‌డ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. కన్నడ ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాని ఎంత‌గానో ఆదరిస్తున్నారు.

Rangasthalam Movie
released
Kannada


మరిన్ని వార్తలు