అఫ్ఘనిస్తాన్ కెప్టెన్‍‌గా రషీద్ ఖాన్

Submitted on 12 July 2019
Rashid Khan appointed Afghanistan captain in all formats

వరల్డ్ కప్‌ టోర్నీ 2019లో పేలవ ప్రదర్శనతో సొంతగడ్డకు తిరుగు ప్రయాణమైన అఫ్ఘనిస్తాన్‌ జట్టులో ప్రధాన మార్పు చోటు చేసుకుంది. టీ20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రషీద్ ఖాన్‌ను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేందుకు పడిన కష్టాలన్నీ వృథా చేస్తూ ఒక్క మ్యాచ్‌లోనూ విజయాన్ని దక్కించుకోలేకపోయింది అఫ్ఘన్. 

మెగా ఈవెంట్ వైఫల్యం అనంతరం 20ఏళ్ల రషీద్ ఖాన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందిస్తూ అఫ్గన్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయంలో బౌలింగ్‌కు దిగి జట్టును ఆదుకుంటాడు. ఈ యువ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్ని నెలలపాటు   నెం.1 స్పిన్నర్‌గా కొనసాగాడు. 

ఇన్నాళ్లు అఫ్ఘినిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అస్గర్ అఫ్గన్ 56వన్డేలకు ప్రాతినిధ్యం వహించి 36మ్యాచ్‌లు గెలిపించాడు. వరల్డ్ కప్ టోర్నీలో గత కెప్టెన్‌కు రషీద్ ఖాన్‌కు మధ్య కొద్దిపాటి మనస్పర్దలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పైగా వరల్డ్ కప్ టోర్నీలో చెత్త ప్రదర్శనతో రషీద్ విమర్శలు ఎదుర్కొన్నాడు. 

Rashid Khan
Afghanistan captain
afghanistan
cricket


మరిన్ని వార్తలు