రషీద్ వల్లే ఓడిపోయాం: అఫ్గనిస్తాన్ కెప్టెన్

Submitted on 25 June 2019
Rashid Khan's Poor Show: Afghanistan Skipper

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ గులాబ్దీన్ నాయబ్ స్పందించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రషీద్ ఖాన్ నిరాశపరిచాడని వాపోయాడు. బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపించాల్సిన రషీద్ దారుణంగా విఫలమవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశీవాలీ లీగ్‌లలో అతడి బౌలింగ్‌లో ఆడడానికి భయపడే బ్యాట్స్‌మెన్ ప్రస్తుత ప్రపంచకప్‌లో వీరవిహారం చేస్తున్నారు. 

‘రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో విఫలమవుతుండటం గురించి ఎక్కువగా మాట్లాడను. అయితే బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో అతడి చెత్త ఫీల్డింగ్‌ మాత్రం అఫ్గాన్‌‌ను ఓడేలా చేసింది. మ్యాచ్‌లో రషీద్‌ ఫీల్డింగ్‌ వైఫల్యంతో బంగ్లా అదనంగా 30 నుంచి 35 పరుగులు సాధించగలిగింది. మా జట్టు ఓటమికి గురికావడానికి ఇది కూడా ఓ కారణమనే చెప్పాలి. ఫీల్డింగ్‌ వైఫల్యాన్ని ఆలోచించకుండా బౌలింగ్‌పై దృష్టి పెట్టమని చెప్పినందుకు నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు'

'బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ సైతం పడగొట్టకుండా, ఫీల్డింగ్‌ వైపల్యంతో రషీద్‌ అందరినీ నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ అనంతరం రషీద్‌ బుద్ధి తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాం. అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రపంచకప్‌ మిగతా మ్యాచ్‌లలో తమ వంతు మంచి ప్రదర్శన కోసం కష్టపడతాం’ అంటూ గులాబ్దీన్ నాయబ్‌.. రషీద్ ఖాన్ ప్రదర్శనపై నిరాశవ్యక్తం చేశాడు. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గన్‌ 62 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 

afghanistan
Rashid Khan
world cup 2019
2019 icc world cup

మరిన్ని వార్తలు