రవిశాస్త్రి వరల్డ్ కప్‌కు రెడీ అవమన్నాడు: దీపక్ చాహర్

Submitted on 12 June 2019
Ravi Shastri said be prepared: Deepak Chahar

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకి పయనమై ఇంగ్లాండ్‌లో ఉంటున్న టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మేర జట్టు ప్రాక్టీస్ చేసేందుకు నెట్ బౌలింగ్ కోసం నలుగురు బౌలర్లను అక్కడికి తీసుకెళ్లింది. వారిలో నుంచి దీపక్ చాహర్ భారత్‌కు ప్రయాణం కాబోతున్నాడు. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్లతో పాటు కోచ్ రవిశాస్త్రిని కూడా కలిశాడు దీపక్.

'వచ్చేసే ముందు నేను అందరినీ కలిశాను. రవిశాస్త్రి సార్ నుంచి ప్రశంసలు అందుకున్నాను. గ్రేట్ జాబ్ చేశావంటూ కొనియాడారు. జట్టులో ఎవరికైనా గాయాలు కావొచ్చు. సిద్ధంగా ఉండమని చెప్పాడు' అని దీపక్ చాహర్ ఇంగ్లీష్ మీడీయాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 

'భారత జట్టు సెలక్టర్లు నాకు పెద్ద బాధ్యతను అప్పగించారు. ఇంగ్లాండ్‌ గడ్డపై ఆడిన అనుభవం ఉండడంతో నాకు ప్రాధాన్యం ఇచ్చారు. టీమిండియా టాప్ ఆర్డర్‌కు బౌలింగ్ వేయమని ఆదేశించారు. విరాట్ భయ్యాకు ఎక్కువగా బౌలింగ్ చేశా. ఇంగ్లీష్ గడ్డపై బౌలింగ్ వేయడం నాకు నచ్చుతుంది. హార్దిక్ పాండ్యా, మహేంద్ర సింగ్ ధోనీలకు బౌలింగే చేసేవాడ్ని. ధోనీ స్వింగ్ ఎదుర్కొనేటప్పుడు బౌలర్ వైపు చూడడు. అందుకే మహీ భాయ్‌ని అంచనా వేయడం కష్టం' అని తెలిపాడు. 

'ఆవేశ్.. చాహర్‌లు భారత్‌కు తిరిగొచ్చేయాలని ముందుగా అనుకున్నారు. ముందుగానే టిక్కెట్లు కూడా బుక్ అయిపోయాయి. కారణమేంటంటే ఇది వరల్డ్ కప్.. ఇవన్నీ ఐసీసీ చూసుకుంటోంది. మాకిచ్చిన పని పూర్తి చేసి తిరిగొచ్చేస్తున్నాం' దీపక్ చాహర్ మీడియాకు తెలిపాడు. చాహర్.. ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, ఆవేశ్ ఖాన్‌లతో పాటు టీమిండియాకు నెట్స్‌లో బౌలింగ్ వేసేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాడు. 

ravi shastri
deepak chahar
Team India
india
world cup 2019
2019 icc world cup
ind

మరిన్ని వార్తలు