ప్రీ-బుకింగ్.. ఆల్ఫా సేల్ : రెడ్ మి K20, రెడ్ మి K20 ప్రొ 

Submitted on 12 July 2019
Redmi K20 and Redmi K20 Pro up on Flipkart Alpha Sale from Today

షియోమీ కంపెనీ రెడ్ మి బ్రాండ్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. జూలై 17న రెడ్ మి K20, రెడ్ మి K20 ప్రొ లాంచ్ కానున్నాయి. ఆల్ఫా సేల్ కింద ఈ రెండు మోడల్ స్మార్ట్ ఫోన్లపై ఐదు రోజులు ముందుగానే కంపెనీ ప్రీ బుకింగ్ ఆఫర్ ప్రకటించింది.

ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా యూజర్లు ఆన్ లైన్ లో శుక్రవారం (జూలై 12, 2019) మధ్యాహ్నాం 12 గంటల నుంచి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగా యూజర్లు Filpkart వెబ్ సైట్లోకి వెళ్లి.. రెడ్ మి K20 పోర్టల్ పేజీపై క్లిక్ చేయాలి.

ఆ పేజీపై కనిపించే ‘గిఫ్ట్ కార్డు’ ఆప్షన్ క్లిక్ చేయండి. కస్టమర్ కు వెంటనే గిఫ్ట్ కార్డు కొన్నట్టుగా ఒక వోచర్, పిన్.. మెయిల్ ఐడీకి వస్తుంది. ముందుగా.. కస్టమర్.. ఫ్లిప్ కార్ట్ గిప్ట్ కార్డు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడీ, కస్టమర్ పేరు  ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఈ గిఫ్ట్ కార్డు విలువ రూ.855 మాత్రమే. మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు గిఫ్ట్ కార్డు మెయిల్ ఐడీకి వస్తుంది. రెడ్ మి k20, రెడ్ మి K20 ప్రొ రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాక... ఫ్లిప్ కార్ట్ ద్వారా గిఫ్ట్ కార్డును రిడీమ్ చేసుకోవచ్చు. 

రెడ్ మి K20, ప్రొ.. స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.39 అంగుళాల డిస్ ప్లే, అస్పెక్ట్ రేషియో 19:5:9
* Full HD+ AMOLED ప్యానెల్ (1080X2340)ఫిక్సల్స్
* స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్
* స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ (Pro)
* అడ్రినో 640 GPU
* 8GB ర్యామ్, DC డిమ్మింగ్ సపోర్ట్ 
* ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
* 4000mAh బ్యాటరీ, 18W, 27W ఫాస్ట్ ఛార్జింగ్
* ఆండ్రాయిడ్ 9 పై 
* 20MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 
* 48MP ట్రిపుల్ కెమెరా సోనీ IMX586 (Pro)
* 48MP ట్రిపుల్ కెమెరా సోనీ IMX582
* సెకండరీ కెమెరా 13MP వైడ్ యాంగిల్
* థర్డ్ కెమెరా 8MP అప్రెచర్ f/2.4

Redmi K20
Redmi K20 Pro
Flipkart
Alpha Sale
pre-book
Flipkart gift card  


మరిన్ని వార్తలు