కండీషన్స్ అప్లయ్ : రిలయన్స్ జియో..  ఫ్రీ AJIO కూపన్స్ ఆఫర్

Submitted on 12 June 2019
Reliance Jio offers free AJIO coupons on Rs 198, Rs 399 prepaid recharge

రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ పై ఉచితంగా AJIO కూపన్స్ ఆఫర్ చేస్తోంది. రూ.198, రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లపై జియో తమ యూజర్లకు ఫ్రీగా కూపన్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ జూన్ 3 నుంచి జూలై 14, 2019 వరకు అందుబాటులో ఉంటుంది. జియో కొత్త యూజర్లతో పాటు పాత జియో యూజర్ల అందరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్స్ ఎంచుకున్న పోస్టు పెయిడ్ జియో యూజర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ రూ.198తో యాక్టివేట్ చేసుకుంటే.. AJIO కూపన్ ఆఫర్ ఉచితంగా పొందవచ్చు. ఈ కూపన్ ను ఐదుసార్లు వరకు రీడీమ్ చేసుకోవచ్చు. ప్రతినెలా ఒకసారి మాత్రమే ఈ కూపన్ పనిచేస్తుంది. రూ.198 రీఛార్జ్ AJIO కూపన్ రీడీమ్ చేయాలంటే.. యూజర్లు కనీస కార్ట్ విలువ రూ.999 వరకు ఉండాలి.

ఈ ఆఫర్.. రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు కూడా వర్తిస్తుంది. AJIO కూపన్ కూడా పొందవచ్చు. ఈ కూపన్ కూడా ఐదుసార్లు రీడీమ్ చేసుకోవచ్చు. కానీ, ప్రతినెలా ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. ఈ కూపన్ రీడీమ్ చేయాలంటే యూజర్లు కనీస కార్డ్ విలువ రూ.1,399 వరకు అవసరం ఉంటుంది. 

AJIO వెబ్ సైట్లోని (ఎగ్జిస్టింగ్ ఆఫర్లలో) AJIO డిస్కౌంట్ కూపన్లు కాల పరిమితి ముగియనున్నట్టు రిలయన్స్ జియో వెల్లడించింది. ఈ కొత్త ఆఫర్.. జూలై 14తో ముగియనుంది. కూపన్లు పొందాలంటే యూజర్లు  ఈ తేదీలోగా రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

రిలయన్స్ జియో..హాట్ స్టార్ భాగస్వామ్యంతో యూజర్లకు వరల్డ్ కప్ 2019 మ్యాచ్ లన్నింటిని ఉచితంగా ఆఫర్ చేస్తోంది. యూజర్ల కోసం రూ.251తో కొత్త అన్ లిమిటెడ్ క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా యూజర్లు.. వరల్డ్ కప్ మ్యాచ్ లను వీక్షించేందుకు 51 రోజుల పాటు 102GB డేటాను పొందవచ్చు. 

reliance jio
 free AJIO coupons
Rs 198
Rs 399
Prepaid Recharge

మరిన్ని వార్తలు