SC,ST అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్  

Submitted on 12 July 2019
Revati  EX  CEO of Mojo TV arrested in SC and ST Atrocity case

మోజో న్యూస్ చానల్ మాజీ సీఈవో రేవతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో మాజీ సీఈవో రేవతి, న్యూస్ ప్రెజెంటర్ రఘును అదుపులోకి తీసుకున్నారు. టీవీ స్టూడియోలో తనను అవమానించారంటూ బంజారాహిల్స్ పోలీసులకు దళిత నాయకుడు ప్రసాద్ కంప్లయింట్ చేశారు. ఈ కేసులో ఏ-1 ముద్దాయిగా మోజో టీవీ యాంకర్ రఘు, ఏ-2 ముద్దాయిగా మాజీ సీఈవో రేవతిలను అరెస్ట్ చేశారు.  

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకేసులో విచారణకు హాజరుకావాలంటూ గతంలోనే వీరికి నోటీసులు జారీ చేశారు. శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 2019, జనవరి 24న మోజో టీవీలో చర్చ నిర్వహించారు. జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాగులరపు వరప్రసాద్ హాజరయ్యారు. చర్చలో యాంకర్ రఘు - వరప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో వరప్రసాద్‌ను స్టూడియో నుంచి బయటకు పంపించారు.

దళితుడైన తనను అవమానించారంటూ అప్పట్లోనే.. ఆయన బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు వరప్రసాద్. ఈ క్రమంలోనే రఘు, రేవతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. వీరు విచారణకు సైతం హాజరుకాకపోవటంతో జూలై 12వ తేదీన వారిద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు.

Revati
CEO of Mojo TV
arrested
SC
ST
Atrocity
Case


మరిన్ని వార్తలు