పాతబస్తీలో రిగ్గింగ్ కలకలం : ఎంఐఎం,ఎంబీటీ కార్యకర్తల ఘర్షణ..

16:39 - December 7, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించటం అంటే మాటలు కాదు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో వుండే పాతబస్తీలో ప్రశాంతమైన వాతావరణంతో పోలింగ్ అనేది కత్తిమీద సామువంటిది. దీంతో సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించింది. ఏ సమయంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా తగిన ఏర్పాట్లను చేసింది. కానీ కొన్ని ప్రాంతాలలో రిగ్గింగ్ జరుగుతోందంటు..పాతబస్తీలోని యాకుత్ పురాలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంపై సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది ఘర్షణకు పాల్పడ్డ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్ పురా, యాకుత్ పురాలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. రాజకీయపార్టీలకు చెందిన వారు, బయట వ్యక్తుల నుంచి తమకు ఫిర్యాదులు అందిన వెంటనే వాటిపై దృష్టి సారించామని చెప్పారు. ఎక్కడా రిగ్గింగ్ జరగడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. 
 

Don't Miss