టీమిండియా బాహుబలి రోహిత్ శర్మ

Submitted on 6 June 2019
Rohit sharma carrying team India, Like Baahubali

వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ బాహుబలి అయిపోయాడు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్.. మ్యాచ్ విన్నింగ్ షాట్ వరకు క్రీజ్ లో ఉన్నాడు. 144 బాల్స్ కు 122 పరుగులు చేసి.. టీమిండియాను గెలిపించాడు. సౌతాఫ్రికాలో ఇండియా గెలిచింది అంటే.. అది కచ్చితంగా రోహిత్ శర్మ ఆట వల్లే అని.. మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ అంటారు.
Also Read : 4రోజులైనా ఆచూకీ లేదు : ఆ విమానాన్ని ఏలియన్స్ ఎత్తుకెళ్లారా!

ఓ వైపు వికెట్లు పడుతున్నా.. బౌలింగ్ కట్టుదిట్టంగా ఉన్నా కూడా ఏ మాత్రం సహనం కోల్పోకుండా కూల్ గా బ్యాటింగ్ చేశాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఫోర్, సిక్సర్ కొడుతూ స్కోర్ బోర్డును నిలకడగా ఉంచాడు. రన్ రేట్ పెరుగుతున్నా.. ఏ మాత్రం తడబడలేదు. రెండు సార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ.. సెంచరీ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత కూడా కూల్ గా బ్యాటింగ్ చేస్తూ.. టీమిండియాకు ఫస్ట్ విక్టరీ అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బాహుబలి అంటూ సోషల్ మీడియా హోరెత్తింది. రోహిత్ ను ఆకాశానికెత్తేశారు.

టీమిండియా భారం మొత్తాన్ని రోహిత్ శర్మ మోస్తున్నాడు అంటూ కొందరు బాహుబలితో పోల్చారు. సౌతాఫ్రికా బౌలర్లు అందరి చూపు రోహిత్ బ్యాట్ వైపే ఉంది అని కొందరు కామెంట్ చేస్తే.. నాలుగు వికెట్లు తీసిన చాహల్ ను మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఏడు రోజుల్లో మూడు సార్లు ప్రయత్నించినా SBI అకౌంట్ ఓపెన్ కాలేదు.. సౌతాఫ్రికా పరిస్థితి కూడా అలాగే ఉంది అంటూ మూడు మ్యాచ్ లు ఓడిపోయిన తీరుతో పోల్చారు నెటిజన్లు.
Also Read : గుడ్ న్యూస్ : గృహ, వాహన రుణాలపై తగ్గనున్న వడ్డీరేట్లు

Rohit Sharma
Team India
Baahubali
kohli
SouthAfrica
WorldCup
cricket

మరిన్ని వార్తలు