కోహ్లీకి 45నిమిషాలు.. రోహిత్‌కు 30నిమిషాలు

Submitted on 12 July 2019
Rohit Sharma thanks fans with a heavy heart

వరల్డ్ కప్ 2019ఆశలు భారత్‌కు లేవనే విషయం ఖరారై రోజులు గడుస్తున్నా.. ఆ బాధ అభిమానులతో పాటు ప్లేయర్లను ఇంకా వేధిస్తుంది. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ కోహ్లీ నిరుత్సాహంగా మాట్లాడగా ఇప్పుడు ఓపెనర్ రోహిత్ శర్మ గుండె బరువెక్కే మెసేజ్‌తో ట్వీట్ చేశాడు. 

అయితే కోహ్లీ 45నిమిషాల ప్రదర్శన మమ్మల్ని టోర్నీ నుంచి పంపేసిందంటే, రోహిత్ శర్మ మాత్రం 30నిమిషాల పేలవ ప్రదర్శనే జట్టు అవకాశాలు కోల్పోయేలా చేసిందని ట్వీట్ చేశాడు. మ్యాచ్ తర్వాతి రోజు రాత్రి సమయంలో రోహిత్ శర్మ ఇలా ట్వీట్ చేశాడు. 

'జట్టుగా కలిసి మేం రాబట్టలేకపోయాం. నిన్నటి మ్యాచ్‌లో 30నిమిషాల పేలవ ప్రదర్శనే మమ్మల్ని ముంచింది. వరల్డ్ కప్ ఆశలను మాకు దూరం చేసింది. నా గుండె బరువెక్కింది నాకు తెలిసి మీరు కూడా అలాగే ఫీలవుతున్నారనుకుంటున్నా. విదేశాల్లోనూ మాకు చక్కటి ప్రోత్సాహమే లభించింది. మైదానాలకు వచ్చి మాకు ప్రోత్సాహాన్నిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు' అని పేర్కొన్నాడు. 

వర్షం కారణంగా జూలై 9, 10తేదీల్లో జరిగిన సెమీ ఫైనల్ 1లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 239 పరుగులు చేయగలిగింది. చేధనలో ఆరంభంలో తడబడి చివర్లో పోరాటం చేసినప్పటికీ భారత్ 221 పరుగులు మాత్రమే చేసింది. 

Rohit Sharma
Virat Kohli
india
Team India
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు